Sunday, June 14, 2020

అమ్మ పిచ్చోడు!

ఓటమి ఒక్క క్షణం మిత్రమా
గెలిస్తే అది తుడిచి పెట్టుకుపోద్ది
కానీ నీకు ఏం చెప్పాలి
గెలిచి చూపించావు
దేశమంతా నీ గెలుపుని చాటింపు వేశావు
ఆలోచించడానికే జంకే చోట
నువ్వు జెండావై ఎగిరావు
స్టార్ల ముందు కూడా
మైమరపించింది నీ తళుకు
పీకేలో పాకిస్తానీ
అన్ టోల్డ్ స్టోరీలో ధోనీ
దిల్ బేచారాగా రాబోయే మన్నీ
ఇన్ని చేసిన నువ్వు
ఎందుకు అలా వెళ్లిపోయావు అంటే
బహుశా అది నీకు నచ్చిన ముగింపు
నీ మొత్తం కథలో నువ్వొక
అమ్మ పిచ్చోడివి, నాలాగ
                             -కేశవ్
(బాలీవుడ్ ధోనీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కదిలించిన జ్ఙాపకాల్నితూకం వేసుకుంటూ...)

0 comments: