Thursday, March 19, 2020

కులము బలము!


కులముయందు జగము
వర్ధిల్లుచున్నది
కులము లేనిచోట
బతుకు కూలిపోవు

కులము లేని కొలువు
యాడ ఉంది
కులము లేకపోతె
భవిత కాలిపోవు

కులములెక్క లేని ఎన్నిక
ఒక్క చోట గలదా
కుల సమీకరణమెత్తని
రాజకీయముందా

కులము అడగని దరఖాస్తు ఏది
కులము ఊసెత్తని పాఠశాల ఉందా
కులము రాయని ధ్రువపత్రమేడ
కులము చూపని జనుల లెక్క ఉందా

పెంచిపోషించు ఘనత మనది
పైకి నటించు లౌక్యమైనది
సంస్కర్తలు, సత్కవుల్
ఉబుసుపోవక రాసినారు కులము కుళ్లని!

కులము లేని మాట
బొంకు గానీ
కులము చెప్పలేని
జంకు గాని

కులము లేని చెట్టు కుళ్లిపోవు
గుణము లేని ఆకు రాలిపోవు
కులమేగ ఆంధ్రజనుల బలము
కులములోనె గలదు జయము
-కేశవ్
(కులము అనే కాలమ్ తీసేసే అద్భుత భారత రాజకీయ వ్యవస్థని కాంక్షిస్తూ...)

0 comments: