Thursday, February 20, 2020

ఆత్మచ్ఛేదం!

ఉచ్చు బిగుసుకున్న మెడ
మొలలు కొట్టిన చేతులు
ఉక్కు బంధనమైన నడుము
విరిచి కట్టిన కాళ్ళు

కారే నెత్తుటి చుక్కలు
రాలే క్రోధపు చినుకులు
ఏవి ఆపగలవు
ఎలా నిలపగలవు

తలలు తీయవచ్చు
తలపులు కాదు
అవయవాలు కోయవచ్చు
ఆలోచనని కాదు

సమాజం వేసే సంకెళ్లు
సంకల్పానికి కాదు
చట్టాలు తెచ్చే కట్టుబాట్లు
చంపడానికి కాదు

అన్నీ బంధించి
అంతా పట్టి లాగితే
మిగిలేది శరీరపు తునకలే
ఆత్మచ్ఛేదం అసాధ్యం

ఆత్మ నశింపజాలదు
అంకురం బంధింపజాలదు
-కేశవ్

0 comments: