Thursday, February 28, 2019

అభినందన

భయం నీ మీసం
అంచుల్ని తాకలేదు
బెరుకు నీ కంటి
వంపులకు జడుసుకుంది

మిగ్ కూలిపోయిన చోట
మినార్ లా నిలబడ్డావు
యుద్ధం వాకిలి ముందు
అద్దంలా మెరుస్తున్న
నీ ఆత్మ విశ్వాసం చూసి
నింగి వంగి సలాం చేస్తుంది

నిన్ను సురక్షితంగా వెనక్కి తెచ్చుకోవడం
ఈ దేశపు నాయకత్వం సాధించే గొప్ప విజయం
నువ్వు మళ్లీ రెక్కలు విచ్చుకొని ఎగరకపోతే
ఈ దేశం బిక్క మొహంతో చచ్చిపోవడం ఖాయం!
 COME BACK SAFE ABHI
                                          -కేశవ్
(మళ్లీ కొన్ని తరాలకు దేశభక్తిని నింపిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మాటకు ప్రేరణగా)

0 comments: