Wednesday, February 7, 2018

బర్నింగ్ కామెంట్రీ!

చెప్పిన మాటలు చెల్లనిచోట
చిల్లర పాటలు పాడిన నోట
రాజకీయం రుచిలేని భోజ్యం
రాజీనామా నిషాలేని మద్యం

ఇంతవరకు చేసినవన్నీ గారడీలే
ఇందాకా కొట్టించినవన్నీ బురిడీలే
కుయుక్తి కుర్చీలెక్కిన కేడీలకు
జనం తల్చుకుంటే పడేది బేడీలే

పకోడీల పాలనలో 
హోదా ఒక చోద్యం
పల్లేరుల పానుపేసి
చెకోడీలతో ఉరితీద్దాం

ఎంకన్నకు పవరుంటే 
ఇంకెందుకు ఆలస్యం
మాటిచ్చిన నాలుకలే
చీలిపేలికవుట తథ్యం
                       -కేశవ్
(దేవిప్రియ స్ఫూర్తితో)



0 comments: