అగ్గిపూలను పుక్కిలించి
ఉగ్గుపాల రుణం తీర్చిన వాడు
మూసి ఉన్న పిడికిలిలో
ఎగిసిపడే సముద్రం వాడు
రెక్కలు తీసేసినా ఎగిరే
ఎడతెగని సంకల్పం వాడు
మృత్యువుకి ఎదురెళ్లే
మరణ మృదంగం వాడు
తరాలు మార్చిన సందేశం ఒకడు
తలరాతలు రాసే సాహసం మరొకడు
ఇప్పటికీ వదలని జ్ఞాపకం ఒకడు
ఎప్పటికీ చెరగని సంతకం మరొకడు
-కేశవ్
(క్యాస్ట్రో నిష్క్రమణకు నివాళిగా...)
ఉగ్గుపాల రుణం తీర్చిన వాడు
మూసి ఉన్న పిడికిలిలో
ఎగిసిపడే సముద్రం వాడు
రెక్కలు తీసేసినా ఎగిరే
ఎడతెగని సంకల్పం వాడు
మృత్యువుకి ఎదురెళ్లే
మరణ మృదంగం వాడు
తరాలు మార్చిన సందేశం ఒకడు
తలరాతలు రాసే సాహసం మరొకడు
ఇప్పటికీ వదలని జ్ఞాపకం ఒకడు
ఎప్పటికీ చెరగని సంతకం మరొకడు
-కేశవ్
(క్యాస్ట్రో నిష్క్రమణకు నివాళిగా...)
0 comments:
Post a Comment