ఆంధ్రుడన్న మాట వింటే
ఎందుకంత ఉలికిపాటు
ఆంధ్ర రాష్ట్రమెందుకన్న
పటేల్ కంటే పహిల్వాన్లా
తలుపు మూస్తే గాయం
తలని కోస్తే న్యాయమా?
ఇదెక్కడి అరాచకం
ఇది కాదా ఆటవికం
మాటిస్తే నమ్మడం
ముంచేస్తే తుంచడం
అదీ, ఇదీ ఒక్కటే
లెక్క చూసి బాదుడే
ప్రత్యేక హోదానే వద్దంటే
అసలు మీకిక్కడ చోటేది
ఇంకు చుక్క తుఫానులో
దమ్ము చూపే దారేది?
ఇచ్చిన మాటని చెల్లిస్తే
పూల విరుల స్వాగతం
ఇది కాదని మీరితే
సమాధులకే తోరణం
-కేశవ్
-కేశవ్
0 comments:
Post a Comment