నడిబజారులో నగ్నంగా
నిజాయితీ నేల రాలిపోయింది...
వాతలు తేలేలా కాల్చినందుకు
కాదు, విలువలు వొలిచినందుకు
తెగిన గాయాల్ని
రెక్కల పొదివుల్లో
తీరని భయాల్ని
రంగుల పొరల్లో
దాపరికం చేసుకున్నా
గుట్టు ఆగదు...
గాలి బలంగా వీచినా
గాజు లంబంగా పగిలినా
మళ్లీ అదే గుండెదడ..
★★★ ★★★
పెదాలకు తాళం వేస్తావు
నీ మాటలకు తాళం వేయమంటావు
కాళ్లకు సంకెళ్లు వేస్తావు
నీతో కలిసి నడవమంటావు...
చేతులు కట్టిపడేస్తావు
నిన్నేహత్తుకొని ఉండమంటావు...
చేష్టలతో చంపేస్తావు...
నీలో చచ్చేంత ప్రేమ ఉందంటావు
మందు రజను రాలిన
నీభుజాన్ని చూసుకునే,
అంత ఉలికిపాటైతే...
తూటా తగిలిన చోటు
ఎలా తట్టుకుంటుంది...
ఎంతకాలం పోరాడుతుంది...
శవానికి చక్కిలిగింతలుండవు
శకలాలకు సౌందర్యం ఉండదు
అయినా నాది పిచ్చి ప్రేమ
అందని ద్రాక్షల శిలా ప్రేమ
మనసు బరువుగా ఉన్నప్పుడు
మరణం తేలిక అవుతుంది...
వేల అడుగుల ఎత్తునుంచీ
అమాంతం దూకేస్తుంది...
అది, పిరికితనపు పరిమళం...
చావు నేర్పిన సాహసం...
-కేశవ్
నిజాయితీ నేల రాలిపోయింది...
వాతలు తేలేలా కాల్చినందుకు
కాదు, విలువలు వొలిచినందుకు
తెగిన గాయాల్ని
రెక్కల పొదివుల్లో
తీరని భయాల్ని
రంగుల పొరల్లో
దాపరికం చేసుకున్నా
గుట్టు ఆగదు...
గాలి బలంగా వీచినా
గాజు లంబంగా పగిలినా
మళ్లీ అదే గుండెదడ..
★★★ ★★★
పెదాలకు తాళం వేస్తావు
నీ మాటలకు తాళం వేయమంటావు
కాళ్లకు సంకెళ్లు వేస్తావు
నీతో కలిసి నడవమంటావు...
చేతులు కట్టిపడేస్తావు
నిన్నేహత్తుకొని ఉండమంటావు...
చేష్టలతో చంపేస్తావు...
నీలో చచ్చేంత ప్రేమ ఉందంటావు
మందు రజను రాలిన
నీభుజాన్ని చూసుకునే,
అంత ఉలికిపాటైతే...
తూటా తగిలిన చోటు
ఎలా తట్టుకుంటుంది...
ఎంతకాలం పోరాడుతుంది...
శవానికి చక్కిలిగింతలుండవు
శకలాలకు సౌందర్యం ఉండదు
అయినా నాది పిచ్చి ప్రేమ
అందని ద్రాక్షల శిలా ప్రేమ
మనసు బరువుగా ఉన్నప్పుడు
మరణం తేలిక అవుతుంది...
వేల అడుగుల ఎత్తునుంచీ
అమాంతం దూకేస్తుంది...
అది, పిరికితనపు పరిమళం...
చావు నేర్పిన సాహసం...
-కేశవ్
0 comments:
Post a Comment