Thursday, April 23, 2015

షట్ డౌన్!

గాయం చేయడం సులువే
గాటు గాటుకీ లెక్కుంటది
సాఫ్ సాఫ్ చెప్పుకున్నా
సెన్సిటివిటీ వదులుకోలేం
తప్పు కనిపించినపుడు 
తప్పకుండా చంపేస్తాం...

మనసుని జూమ్ చేసి
వైరస్ స్కాన్ చేసినపుడు
జంక్ ఫైల‌్స్ తీసిపారేస్తాం
ఏమీ లేకుండా పదేపదే
అదేపనిగా స్కాన్ చేస్తే
వైరస్ కాదు వాల్యూడౌన్

చెయ్యాలనిపిస్తే చేసేయొచ్చు...
వద్దనిపిస్తే వదిలేయొచ్చు...
చేస్తానని చెప్పేశాక ఆపేవాడెవడు
ఆగిపొమ్మన్నా ఆగేవాడెవడు..
చాలాసార్లు తొలిచే సందిగ్ధం
బొమ్మా బొరుసా వేస్తాం..
తప్పు సమాధానం వచ్చిందని కాదు
నచ్చిన సమాధానం వచ్చేవరకు

కాళ్లు నరికేసి పరిగెత్తమన్నావు
చేతులు తీసేసి హత్తుకున్నావు
నవ్వులకి నగిషీలు పూసుకొని 
నమ్మకానికి రంగులు వేసుకొని
మళ్లీ ఏదో కొత్త చిత్రం గీస్తున్నావు
మోడుగా మార్చిన మోడర్న్ ఆర్ట్ 

అనుమానం... అపనమ్మకం
అవమానించేలా మాట్లాడటం
నీకు నువ్వే అన్నీ ఊహించుకోడం
ప్రతిసారీ నన్నేదో దోషిలా చేయడం
నీ తప్పేం లేదు తప్పంతానాదే ...
నాకు నచ్చలేదు... షట‌్ డౌన్!
                            -కేశవ్

0 comments: