Thursday, October 23, 2014

విషపు నవ్వు








నవ్వడం అంటే
పెదవుల్ని విదిలించడం కాదు
నవ్వడం అంటే
కళ్లని చికిలించడం కాదు
నవ్వడం అంటే
గొంతుని సకిలించడం కాదు
నవ్వడం అంటే
మనసుని పలికించడం
నవ్వడం అంటే
బంధాన్ని పెనవేయడం
నవ్వడం అంటే
మనుషుల్ని అల్లేయడం

పెదవుల్లో విషాన్ని దాచుకుంటే
ప్రేమ పుడుతుందా...
అనుబంధాల వాన కురిస్తే
పాషాణం కరిగిపోతుందా... 

గుండెల్లో దోషాన్ని దాచుకొని
కళ్లల్లో వక్రభాష్యాన్ని నింపుకొని
మాటలకు పంచదార అద్దుకొని
పెదవులపై మల్లెల జల్లు కురిపిస్తే
విరిసేది నవ్వుకాదు, విషపు పువ్వు

                         -కేశవ్