Friday, September 26, 2014

ద్వేషం













నన్ను
ఎక్కువగా ద్వేషించొద్దు
మళ్లీ ప్రేమించాల్సి వస్తుంది

నన్ను 
ఎక్కువగా ధూషించొద్దు
మళ్లీ కీర్తించాల్సి వస్తుంది

నన్ను 
ఎక్కువగా నిందించొద్దు
మళ్లీ ఓర్చుకోవాల్సి వస్తుంది

మాటలు చెప్పడం కాదు
మనసుని విప్పడం అంటే
కోటలు కట్టడం కాదు
నీతికి నిలవడం అంటే

ఎగిరే గాలిపటాన్ని కాదు
దారం తెగి నేలరాలటానికి
ఎగిసే పిల్లతెమ్మరను కాదు
దూరం చూసి ఆగిపోడానికి

అలసట ఎరుగని 
సముద్రం నా ఆదర్శం
బతుకు బాసట చెప్పే
శిఖరతత్వం నా స్ఫూర్తి

అనంత విశాలత్వంలో 
అల్పత్వానికి చోటుండదు
అద్దాల మందిరంలో
అన్నీ అసలు బింబాలేనా
నకిలీ బొమ్మల మధ్య
నిజాన్ని చూడటమే కష్టం

ఎగిరినపుడు పక్షిలాగ
నడిచినపుడు నింగిలాగ
దూకినపుడు సముద్రంలాగ
మారిపోవడం నాకు సహజం
అందుకే
ఎక్కువగా ద్వేషించొద్దు
మళ్లీ ప్రేమించాల్సి వస్తుంది

                      -కేశవ్








0 comments: