Thursday, August 21, 2014

చిక్కు ప్రశ్నలుచెత్తబుట్ట
పూల బొకే అవుతుందా...

చెరువు గట్టు
చైనా గోడ అవుతుందా...

తగరపు కాగితం
తాజ్ మహల్ అవుతుందా...

తళుకుల దారం
తారల తోరణం అవుతుందా...

మనసు ముక్కలైనపుడు
మిగిలేది చిక్కు ప్రశ్నలే...

                 -కేశవ్

0 comments: