Tuesday, May 13, 2014

అసూయ










నేనంటే
ఎందుకంత అసూయ
నలిగిపోయిన ముఖాల మధ్య
నక్షత్రంలా మెరిసిపోతున్నందుకా...

నేనంటే 
ఎందుకంత అసూయ
నకిలీ మనసుల మధ్య
నిఖార్సుగా కనిపిస్తున్నందుకా...

నేనంటే 
ఎందుకంత అసూయ
మకిలి మనుషులు మధ్య
ముత్యంలా స్వచ్ఛంగా తేలినందుకా...

నేనంటే 
ఎందుకంత అసూయ
దాగుడుమూత బతుకుల మధ్య
తెరిచిన పుస్తకంలా నిలిచినందుకా...

నేనంటే 
ఎందుకంత అసూయ
తాటిచెట్టులా ఎదిగిన తలతిక్కలతో
తలవంచకుండా తలపడుతున్నందుకా...

నేనంటే 
ఎందుకంత అసూయ
ఇరుకుతనపు ఆలోచనల మధ్య
నిటారుగా నిలబడినందుకా...

నేనంటే 
ఎందుకంత అసూయ
నగిషీల తళుకుల మధ్య
నిజాయితీతో నిలిచి గెలిచినందుకా...
                                     -కేశవ్

0 comments: