Saturday, May 10, 2014

2013




ఎగిసిన రవ్వలు
రాలిన పువ్వులు
అభివృద్ధికి అడ్డగీతలు
జనంమధ్య నిలువుగీతలు
మరణం నాది
మననం మీది


పాదయాత్ర పొలకదారుల్లో
ఓరుగల్లు పొలిమేరల్లో
చీలిన జాతి గుండెలపై
చిలకరించిన చలిక్షణాలు
మరణం నాది
మననం మీది

వాలిన మస్తిష్కంలో
రేగిన గాయాలు
తీరని కోరికల్ని
తిరిగతోడిన రోజులు
మరణం నాది
మననం మీది

కేదారలోయలో కడతేరని శోకం
హస్తిన మకుటంపై మశకం
ప్రభుత్వ పతనాలు
పాలెం పాతకాలు
మరణం నాది
మననం మీది

         -కేశవ్

0 comments: