తలపాగా చుట్టి,
తెల్లని పంచె కట్టి
కర్రసాము చేస్తే
దసరా బుల్లోడే
సూట్ వేసి సూటిగా
చూస్తే
సెతస్కోప్ లేకున్నా
డా.చక్రవర్తే
గ్లాసు పట్టుకుంటే
అంతా కల్లాస్…
గళం ఎత్తితే ఘంటసాల
గజల్స్...
మనసు మాటచెప్తే
అంతా తమస్...
నటనలో నువ్ నాగేశ్వర్రావువి
బాస్...
చిటపట చినుకులు
రాలుతున్నప్పుడు
కారులో షికారుకి
వెళ్తున్నప్పుడు
ఖుషీ ఖుషీగా
నవ్వుతున్నప్పుడు
నీఉంగరాల జుత్తు గింగిరాలు
కొడుతుంది.
నిన్ను చూసి
ప్రేమించడం నేర్చుకున్నాం...
నిన్ను చూసి వియోగాన్ని
ఆస్వాదించడం నేర్చుకున్నాం...
నీ సోగకళ్లు చూసి బాధను
దాచేసుకోవడం నేర్చుకున్నాం...
నీ పెదవుల
బిగింపుని చూసి సహనం విలువ తెలుసుకున్నాం...
నటనను మాత్రమే
నమ్ముకున్నవాడివి...
సినిమాను మాత్రమే జుర్రుకున్నవాడివి
సంపాదించిన ప్రతి
పైసాని ఫ్రేం టు ఫ్రేం
సెల్యులాయిడ్
సోకులకు అద్దినవాడివి
మందునీ మెడిసిన్ గా
మార్చేసినవాడికి
మరణం అంత సులువుగా రాదు...
నువ్వు లేకున్నా దేవదాసు,
కాళిదాసు,
నీ కబీర్ దాసు
అజరామరమే కదా...
పరిపూర్ణ
జీవితానికి పర్యాయపదం నీవే
నీ మధుపాత్ర భాషలో
చెప్పాలంటే
మొత్తానికి ఓ నైంటీ
వేశావ్ గురువా..
ఇక టాటా...
వీడ్కోలు... ఇంక సెలవ్
-కేశవ్
0 comments:
Post a Comment