Wednesday, January 8, 2014

లైట్సాఫ్!












డెడ్ ఎండ్ వచ్చినప్పుడు
ముగించాల్సిందే...
బతుకు, బండి కాదు
యూ టర్న్ చేయడానికి
ముసుగులు ముఖాలకేనా
మనసులకి కూడా
అవసరం తీరినప్పుడు
అంతా తీసిపారెయ్యాలి
కల్మషం లేకుండా
నవ్వే నవ్వు వెనుక
విషాదం ఉండవచ్చు
మెరిసే ముఖం వెనుక
అలసిన మనసు ఉండవచ్చు
అయినా నవ్వాల్సిందే
అది నీ వృత్తి ధర్మం...
నవ్వలేక ఆగిపోవడం నేరం
నవ్వుని తుడిచేసి
నిష్క్రమించడం ఘోరం

నమ్మకం నిలువునా కోసినప్పుడు
నమ్మినవాళ్లు చీకట్లోకి తోసినప్పుడు
నిజానికి ప్రయాణం ఆపడమే మేలు
బతుకుని చిమ్మచీకట్లో తిప్పడంకంటే
చిలక కొయ్యకి తగిలించడం మంచిది
నిన్ను వెంటాడి ఏడిపించిన వాళ్లంతా
నీ నిష్క్రమణతో ఏం సాధిస్తారో చూస్తాం
పాతికేళ్లకే శిఖరం ఎక్కిన నువ్వు
ముప్ఫై మూడేళ్లకి రాలిపోయావ్
స్వశక్తిని నమ్ముకున్నవాడికి
రెండే తెలుసని మరోసారి చెప్పావ్,
ఒకటి గెలవడం
రెండు చచ్చిపోవడం
ఇక లైట్సాఫ్...

                    -కేశవ్

0 comments: