Tuesday, December 17, 2013

అందం



అవునంటే కాదంటావ్ కానీ
అచ్చు సావిత్రిలా లేవూ...
కాదు కాదు ఇదిగో చూడు
సావిత్రే నీలాగ కనిపిస్తుంది...

నాకు నీకు ఎప్పుడూ పడకున్నా
నీకు నాకు ఎక్కడా కుదరకున్నా
నువ్వొప్పుకున్నా ఒప్పుకోకున్నా
ఒకటి మాత్రం నిజం నువ్వూ, సావిత్రీ ఒక్కటే

అందం గురించి చెప్పమంటే
ఆ పేరే ముందొస్తుంది
అభినయం గురించి చెప్పమంటే
ఆమె మాటే వినిపిస్తుంది
అందం, అభినయం కలిసిన
రూపం గురించి మాట్లాడమంటే
ఆమే ముందు వరసలో ఉంటుంది

మరి
నీకు, ఆమెకీ పొత్తు కుదరదంటే
నేనెలా నమ్ముతాను...
నువ్వూ ఆమే వేర్వేరంటే
నేనెలా ఒప్పుకుంటాను...
నాకు తెలిసినంతవరకు
నువ్వంటే అందం...
అందమంటే సావిత్రి... అంతే!
                  
                     -కేశవ్

0 comments: