Monday, June 3, 2013

MIRROR

   అద్దం  


  అద్దం అవతల నువ్వు 
  ఇవతల నేనూ 
  ఒకరినొకరు
  చూసుకొని 
  ఇంతకాలం ఇద్దరం 
  ఒకటే అనుకున్నాను... 

  నవ్వినప్పుడు నవ్వు 
  కోపంలో కోపం 
  చిరాకులో చిరాకు 
  ఏడ్చినప్పుడు ఏడుపు 
  అన్నీ నావే అనుకున్నాను

  ఎక్కడ చూసినా 
  ఎక్కడికి వెళ్ళినా 
  ఎవరితో మాట్లాడినా 
  ఎందరితో పోట్లాడినా 
  నీడలా వెంటే వస్తోంటే 
  అదీ నేనే అనుకున్నాను... 

  అది అద్దంలో కనిపించే బొమ్మకాదు 
  అద్దంలా మురిపించే అమ్మాయికాదు
  అసలది అద్దమే కాదు, గాజుపలక 
  అందుకే నేనిప్పుడు ముక్కలు చేశాను... 

  నేను ఉన్నది ఇటు,
  నీవు ఉన్నది అటు...
  ఇక నేను నేనే
  నువ్వు నువ్వే...

                  - కేశవ్

4 comments:

Anonymous said...

అద్దం ఛిద్రం చేశారుగా

keshav said...

Thanq andi...

Anonymous said...

ADDAM NAKU ARDHAM KADU EPPUDU...NEELA

keshav said...

NEELA ante naala anaa leka me peraa?!?!