Thursday, September 19, 2013

నిస్వరం



నేను
నిస్వరమైనప్పుడు
నాపై తెల్ల కాయితాలు కప్పండి
నాలుగు సిరా చుక్కలు చల్లి
పాళీతో అంటించండి
అక్షరమై మళ్ళీ పుడతాను
ఎక్కడ వెలుగు కనబడినా
అది నాదే...
ఎక్కడ తెలుగు వినపడినా
అది నేనే...
- కేశవ్

0 comments: