Saturday, December 23, 2006

హ్రుదయ సాగరం...!


అలల గలగలల్లో తీరం చేరి
అలసట తీర్చుకోవడం నీ తంతు
ఆలోచనల దొంతరల్లో దూరతీరాల వైపు
అలుపెరుగని పయనం నా వంతు
సాగరమా ఓ సాగరమా...
నీ దేహం నా హ్రుదయమంత విస్తారమా

గాలి తెరల్లో పుట్టిన శూన్యం
నేల పొరల్లో చెలరేగిన దైన్యం
అవధులు మించినపుడు
ఆత్మాశ్రయ రాగంలో సునామికలు
వినిపించడం నీ నైజం

విషాద వీచికలు, ప్రతికూల పాచికలు
ప్రళయ గర్జనలై ముంచెత్తినప్పుడు
ఓటమి అలజడిలోనూ గెలుపు గీతికలు
పలికించడం నాకు సహజం
సాగరమా ఓ సాగరమా...
నీ దేహం నా హ్రుదయమంత విస్తారమా
-కేశవ్