Monday, December 11, 2006

..........పునరపి జననం...!...


  • నీవు వెళ్లిపోయావ్
    నీ స్వరం మాత్రం అనుబంధ శరమై
    అనంతానంత తరంగమై
    మమ్మల్ని వెంటాడుతుంది
    సుప్రభాత శరత్తువై పలకరించే
    మా తరం మీరాబాయ్
    ఈ గాలి ఊళల్లో ఇంకా
    నీ గళం ధ్వనిస్తోంది...!
    నీ కట్టు, బొట్టు
    భారతీయతకు ఆటపట్టు
    సప్తాక్షర యజ్ఞంలో
    నీవు ఒలికించిన భక్తితత్వం
    నాస్తికత్వానికీ శ్రవణపేయం

    ప్రాతఃకాల పడుచుదనంలో
    సహస్రనామ రసధునిలో
    ఆకాంక్షిస్తాను, నీ సదాశయం సిద్ధించాలని!
    ప్రతి ఇంటా ఓ సంగీతలక్ష్మి ఉదయించాలని!!
    1. -స్వర దేవతకి అక్షర నివాళి -కేశవ్
    (డిసెంబర్ 12 ఎం. ఎస్. సుబ్బులక్ష్మి వర్ధంతి)

4 comments:

kiran kumar toleti said...

Good tribute..

KRISHNA said...

కేశవ్ గారు మీ కవిత చాలా బాగుంది

Anonymous said...

hello Mr.Kesav,

good to see your work on the data that you gather. Once again i am thanking you that you working are inspiring and good for the other people too.

hope u will maintain in the near future.........

with best and heartful wishes

ur
velvisher

kalyan said...

sangita lakshmi siddhinchalani, nuvvasistunnava, subbalakshmi asinchinda? edaintenemle, all boils down to the same thing. jst kidding. On Christmas eve, do not grieve, every adam has his eve, no god shall deprive neither can any man, Did not pope say hope is ever blest in human breast?
i will take my leave, while u wait for ur eve.