Thursday, March 2, 2017

బతుకు ‘చితి’కి...



వదులుకుంటే తిరిగి తెచ్చుకోవచ్చు 
పోగొట్టుకుంటే వెదికి పట్టుకోవచ్చు 
పారేసుకుంటే ఎవరైనా తెచ్చి ఇవ్వొచ్చు 
పగలగొట్టుకుంటే, మిగిలేది ముక్కలే! 

నిలబెట్టుకోవాలనే జ్ఞానం ఉన్నప్పుడు 
పగలగొట్టుకునేదాకా తెచ్చుకోకూడదు 
బతుకైనా, అతుకైనా ఒక్కటే కదా 
జారిందా దొరకదు... చితికిందా అతకదు!!
                           -కేశవ్

0 comments: