ఇన్నేళ్ల తర్వాత వెతకాలనిపిస్తోంది
పాతపడి మాసిపోయిన ముఖాన్ని
తిరిగి తెచ్చుకోవాలనిపిస్తోంది
నలిగిపోయిన ముడతల్ని సరిచేసి మరీ
అంటించుకోవాలనిపిస్తోంది
ఏది నకిలీ ఏది నిఖార్సు
ఏది నిజం ఏది అబద్దం
కాలచక్రంలో సుడులుతిప్పి
పిప్పి చేయాలనిపిస్తోంది
మనసుని తవ్విపోసి
జ్ఞాపకాల దొంతరల్ని
చెల్లాచెదురు చేస్తుంటే
పోగొట్టుకున్న ముఖాలు
మళ్లీ మళ్లీ పలకరిస్తున్నాయి
అన్నీ పాతవే, కానీ
కొత్తగా కనిపిస్తున్నాయి
అన్నీ పాతరేసినవే
పైకి లేచిమరీ పలకరిస్తున్నాయి
వద్దనుకున్నవే
వెలుగు దివ్వెలయిపోయితున్నాయ్
వదిలేసుకున్నవే
తెచ్చిపెట్టుకోవాలనిపిస్తున్నాయ్
-కేశవ్
పాతపడి మాసిపోయిన ముఖాన్ని
తిరిగి తెచ్చుకోవాలనిపిస్తోంది
నలిగిపోయిన ముడతల్ని సరిచేసి మరీ
అంటించుకోవాలనిపిస్తోంది
ఏది నకిలీ ఏది నిఖార్సు
ఏది నిజం ఏది అబద్దం
కాలచక్రంలో సుడులుతిప్పి
పిప్పి చేయాలనిపిస్తోంది
మనసుని తవ్విపోసి
జ్ఞాపకాల దొంతరల్ని
చెల్లాచెదురు చేస్తుంటే
పోగొట్టుకున్న ముఖాలు
మళ్లీ మళ్లీ పలకరిస్తున్నాయి
అన్నీ పాతవే, కానీ
కొత్తగా కనిపిస్తున్నాయి
అన్నీ పాతరేసినవే
పైకి లేచిమరీ పలకరిస్తున్నాయి
వద్దనుకున్నవే
వెలుగు దివ్వెలయిపోయితున్నాయ్
వదిలేసుకున్నవే
తెచ్చిపెట్టుకోవాలనిపిస్తున్నాయ్
-కేశవ్
0 comments:
Post a Comment