Friday, November 4, 2011

MOst MOdernist!

మోస్ట్ మోడర్నిస్ట్
ఆగస్టు 2, 2011
ఉదయార్కుడు వచ్చినపుడు...
సాంధ్యభాష ఎదురయ్యింది....
ఏమిటీ విచిత్రం అంటే ....
ఓ మిత్రుడు చెప్పాడు..
‘మో’ వెళ్లిపోతున్నాడని..

ఐ నో హిమ్ ఫర్ ద
పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్...
హి నోస్ మి ఫర్ ఓన్లీ ఒన్..!
నౌ హి ఈజ్ ఆన్ పాసేజ్!!

ఇంగ్లీషు పాఠాలు చెప్పే బ్రిటీషోడు...
తెలుగు పొయట్రీని ఇంతలా కాచి
చల్లార్చి వడపోసి కమ్మని వైన్లా
కుమ్మరిస్తాడని అనుకోలేదు...

వేళ్ల మధ్య సిగరెట్ ఫీలింగ్
మత్తుగా తూగే చూపులు
శూన్యంలో తిరిగే ఆలోచనలు
నిర్లక్ల్యంగా ధ్వనించే కంఠస్వరం
నిదానంగా కదలాడే శరీరం
నిషాగా కనిపించే కళ్ళు
ఇలియట్ని వదలని పెదాలు
అన్నీ కలగలిపితే క్లాస్లో 'మో'

గాజు పెంకులు, కాగితం ముక్కల్తో
కైతల జరీ అంచు చొక్కా నేతగాడు
మా మనసులపై మౌనంతోనే
గమ్మత్తు ముద్రల లిపికారుడు

ఇలా అకస్మాత్తుగా నిష్క్రమిస్తాడనుకోలేదు...
ఇంత అలజడిని మిగులుస్తాడనుకోలేదు
ఇక తెలుగు కవిత్వానికి కన్ఫ్యూజనే...మో!
ఇల నుంచి హెల్లోకి మోడరన్ సిలబసే...మో!

(మూడేళ్ళు పాఠం విన్నా, పరిచయం ఉన్నా...
వేగుంట మోహన్ ప్రసాద్ - మో ఒకరేనని మాకు తెలీలేదు...
తీరా తెలుసుకున్నాక ఒక్కసారే కలిసే అవకాశం దక్కింది..
ఎంత గొప్ప కవైనా మో నరకంలోకే వెళతాడని మానమ్మకం,
తన కవిత్వ పరిమళాలను మాతో పంచుకోనందుకు నిరసనగా...
నౌ ఐ మిస్ హిమ్ ఎలాట్... యాజ్ ఎ మాస్టర్, యాజ్ ఎ పొయెట్...)
                                        -కేశవ్ 

1 comments:

ఎందుకో ? ఏమో ! said...

Good

Gammatthu ga undi pada dhwani

flow is good

?!

http://endukoemo.blogspot.com