వీడికి నవ్వడం తెలుసు...
నవ్వించడం తెలుసు...
వెక్కిరించడం తెలుసు...
విసిగించడం తెలుసు...
కన్నీళ్ళు తెప్పించడం కూడా తెలుసని
మేం తెలుసుకొని అప్పుడే మూడేళ్ళు
క్రైం రిపోర్టర్ కదా
'మస్త్ శవం తెచ్చా హెడ్ లైన్ చెయ్
బుద్ది లేకుండా ఎందుకు చస్తార్రా భాయ్'
ఇదీ వాడి ధోరణి
'ఎవడేమన్నా లైట్ తీస్కొ నచ్చిన పని చెయ్
పక్కనున్న ప్రతివాణ్ణీ కాదు, ఫ్రెండ్ని నమ్ము'
ఇదీ వాడి ఫిలాసఫి...
వాడు దుడుకు మనిషి
నాది కుదురు స్వభావం
నేను ముడుచుకుపోతాను
వాడు విరుచుకుపడతాడు
నేను కనిపించినంత సౌమ్యుడిని కాదు
వాడు వినిపించినంత కఠినుడూ కాదు
మనసు గాయపడితే మాత్రం
ఇద్దరం ఒకేలా స్పందిస్తాం
అందుకే వాడంటే నాకిష్టం
వాడు ఇక లేడని తెలిసినప్పుడు
ఆ దు:ఖం నుంచి తేరుకోడానికి
కనీసం మూడు రోజులు పట్టింది
వాడి జ్ఞాపకాలను వొదులుకోవాలంటే
ఒక జన్మంతా సరిపోదేమో... ఎందుకంటే
వాడు చాలా విలువైన మనిషి
విలువలున్న మనిషి...
కానీ ఎప్పుడో ఒకసారి ఎదురుపడితే
ఏ బుద్ధితో మాకు దూరమయ్యడో అడగాలి
ఏ స్నేహం వాడి మనసుని చిదిమేస్తే
ఇంత పనీ చేశాడో ఆరా తీయాలి...
ఎప్పటినుంచో మనసు తొలుస్తున్న ప్రశ్నలివి!!
(మా 'షేమ్' గాడిని గుర్తుచేసుకున్నందుకు ఆనందంగా...
వాడికి ఏడవటమంటే అస్సలు నచ్చదు కదా...)
-కేశవ్
-కేశవ్
'శ్యామ్' గురించి తెలుసుకోవాలంటే...
12 comments:
కేశవ,,
ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
శ్యామ్ శారీరకంగా దూరమైనా , అతను చిరంజీవిగా నీ మనస్సులో ఎప్పుడు తోడుంటాడు. అతను కంటికి కనపడకున్నా ఎప్పుడూ నీ ఆలోచనల్లో తోడుంటాడు. ఇది నిజం..
I am sorry to know that you lost a great friend...
-yamini
the poem is good, sir.
Happy Friendship Day !!
-prasad
bavundhi..........
Kesav sir,
Spandince mee hrudayaniki abinandanalu... meelo vunde kavitaavesaniki... Subakankshalu...
Taralu maarina...viluva taraganidhi... Chedirina jeevitallo virajajulni pooyinche pennidhi... vidhinedirinchina... Ontari tanaaniki.... Sedateerche pennidhi... Chelime...!
Happy friendship Day...
Syaam manalni viDichi appuDea mooDeaLlu ayimdamTea
nammaSakyamgaa leadu.
mana madhya leaka poayinaa...
tana sTayil amD smayil ...
eppuDua sajeevamgaanea umTaayi.
keaSav gaarua ,
Syaam gurimchi chakkagaa raaSaaru...
Nice tribute to Sham
on Friendship Day
rajani
meeru sham ke kadandi andariki cheppinatte ,aa sham lone ham(manamu) kuda unnamu,oka pakka sneHITHUDU antune duramayyaru antunnaru tappu kada..........
-apsara
keshav Garu...!
Andariki duranga veiiopi edipinchina, edipisthunna shyamki adbhuthanga nivali arpincharu....
Blated HAPPY Friendship Day....
hi,
hru?me frd gurinchi rasindi chadvanu.i am sorry to know that he is no more.may hi soul rest in peace kavitha bagun di.
-arpita
Iddaru manchi snehitulu eppudu vidiporandi............. Ante Manishi daggaraga lekhapoina lekha manasu daggaraga lekhapoina........
Bharati.
kesavji... very nice.
Lella Siva Prasad
శ్యాం అల్లరోడని తెలుసు
కేశవ్ మొండోడని తెలుసు
ఇద్దరి మధ్య ఇంత అనుబంధం ఉందని
ఇప్పుడె తెలిసింది!!!
-ప్రతాప్
Post a Comment