ఇప్పుడు
రాయడం బరువయింది...
రాతకి విలువ తగ్గి...
మాటలే రాళ్లలా తగిలే
రాలుగాయిల సమాజంలో
రాయడం బరువైంది...
అక్షరాలను తూచే రాళ్లు కరువైనప్పుడు
రాయికంటే మాటలే మొనదేరినప్పుడు
రాయడం బాగా బరువైంది...
రాయడం అంటే నోటికొచ్చినట్టు వాగడం
ఎదుటివాడు సచ్చినట్టు చావ బాదడం...
మాట చేసే గాయాలకు
మందు లేదు..
మంచి చెప్పే మాటలకు
మన్నికా లేదు
మాట్లాడటం అంటే పోట్లాడ్డమే
మాట విసరడం అంటే
మన మాట గెలిచే వరకు
నాలుగు పోట్లు పొడవడమే...
అందుకే ఇప్పుడు
మంచి అన్నది రాయడమే బరువైంది!
-కేశవ్
0 comments:
Post a Comment